3 April 2020 3:08 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / కరోనా: ఏప్రిల్ 4న...

కరోనా: ఏప్రిల్ 4న జాతీయ సంతాప దినంగా ప్రకటించిన చైనా ప్రభుత్వం

కరోనా: ఏప్రిల్ 4న జాతీయ సంతాప దినంగా ప్రకటించిన చైనా ప్రభుత్వం
X

కరోనా మహమ్మారికి బలైన వారికి సంతాపం తెలిపేందుకు ఏప్రిల్ 4న జాతీయ సంతాప దినం పాటించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వలన ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ లీ వెన్లీయాంగ్‌తోపాటు 3,300 మందికి పైగా చైనీయులకు శనివారం సంతాపం తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శనివారం చైనాతోపాటు విదేశాల్లోని అన్ని చైనా రాయబార కార్యాలయాల్లో జాతీయ జెండాలను అవనతం చేసి ఉంచుతారు.

దీంతో శనివారం దేశంలో అన్ని ప్రజా వినోద కార్యక్రమాలను రద్దు చేశామని సర్కారు ప్రకటించింది. శనివారం ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలు మూడు నిమిషాలు మౌనం పాటించి.. కరోనా మృతులకు సంతాపం తెలుపుతారు. ఈ సందర్భంగా విమానాలు, బస్సులు, రైళ్లు, ఓడల్లో సంతాపసూచకంగా సైరన్ మోగించనున్నారు.

Next Story