సామాజిక దూరం పాటించకపోతే.. జరిమానా కట్టాల్సిందే

సామాజిక దూరం పాటించకపోతే.. జరిమానా కట్టాల్సిందే

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. రోజు రోజుకి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారి పై కొన్ని దేశాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా కరోనా కట్టడికి కెనడాలో ముఖ్య నగరమైన టొరంటోలో అధికారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే.. 5000 కెనడా డాలర్లను జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే సామాజిక దూరం పాటించాలని సూచించినా.. ప్రభుత్వ ఆదేశాలను ఎవరూ పార్టీటించకపోవటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్కులు, బహిరంగ ప్రదేశాలు, ఏ ఇతర ప్రాంతాల్లోనైనా సరే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొనేటప్పుడు వారి మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలని.. లేకపోతె.. జరిమానా తప్పదని ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story