ఉపవాసం ఉందాం.. కరోనాను తరిమేద్దాం: బ్రెజిల్ అధ్యక్షుడు

కరోనాపై పోరాటానికి ఒక్కోదేశం ఒక్క రకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి దేశానికి పట్టిన కరోనా పీడ వదిలేలా చేద్దాం’ అని బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజలంతా ప్రార్థనలు చేసి బ్రెజిల్ నుంచి కరోనా భూతాన్ని తరిమేయాలని కోరారు.
కరోనా కట్టడిలో బోల్సోనారో విఫలమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కొందరు మత ప్రచారకులను కలుసుకున్నారు.. వారి సూచనలు మేరకే ప్రజలను ఉద్దేశించి రేడియోలో ఆయన ప్రసంగించారు. ‘బ్రెజిల్‌లో మత ప్రచారకులు, పాస్టర్లలతో కలసి మనందరం ప్రార్థన చేయడానికి ఓ రోజు కేటాయిద్దాం. ఆ రోజు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి దేశానికి పట్టిన కరోనా పీడ వదిలేలా చేద్దాం’ అని బోల్సోనారో పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com