మీరు వాడే మందు మాకివ్వండి.. మోదీని కోరిన ట్రంప్

మీరు వాడే మందు మాకివ్వండి.. మోదీని కోరిన ట్రంప్

ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనాకి మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. అయితే.. భారత్ వినియోగిస్తున్న హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మంచి ఫలితాలనిస్తుంది. ఈ ఔషధం భారత్ లో పెద్ద ఎత్తున తయారు చేస్తున్నాం. దీనిని తమకు అందించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ట్రంప్ తెలిపారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా భారత్ ఎగుమతులను, భారత్‌కు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.

మలేరియా నివారణకు వాడే హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను కరోనాపై బాగా పని చేస్తుంది. అయితే... క్లినికల్‌గా ఇంకా రుజువు కాకపోయినా కోవిడ్‌-19 వైరస్‌ నివారణకు ఇది బాగా ఉపయోగపడుతోందని వైద్యులు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ నివారణకు ప్రివెంటివ్‌ మెడిసిన్ గా హైడ్రాక్సిక్లోరోక్విన్‌ వాడకాన్ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ ఇప్పటికే అనుమతించింది. దీంతో ట్రంప్ భారత్ లో మంచి ఫలితాలు లభిస్తున్న ఈ ఔషధాన్ని తమకు ఇవ్వాలని కోరారు. అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story