అండర్‌వేర్ క్లాత్‌తో మాస్క్‌లు.. పాక్‌ను మోసం చేసిన చైనా

అండర్‌వేర్ క్లాత్‌తో మాస్క్‌లు.. పాక్‌ను మోసం చేసిన చైనా

కరోనా వైరస్‌కు పుట్టినిల్లైన చైనాలో ఇప్పుడు దాని ప్రభావం బాగా తగ్గిపోయింది. ప్రపంచ దేశాలన్ని మాత్రం ఈ వైరస్ మహమ్మారి ఇంకా వణికిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న కొన్ని మిత్ర దేశాలకు మాస్క్‌లు పంపిస్తామని చైనా హామీ ఇచ్చింది. అందులో భాగంగా చైనాకు చిరకాల మిత్రదేశమైన పాక్‌కు సైతం మాస్క్‌లను, తదితర వైద్య సహాయక పరికరాలను పంపింది. అయితే ఆ మాస్క్‌లను చూసిన పాక్ అధికారులకు దిమ్మతిరిగింది.

కరోనా వైరస్‌ నేపథ్యంలో టెస్టింగ్‌ కిట్‌లు, నాణ్యమైన ఎన్‌-95 మాస్క్‌లు అందిస్తామని పాక్‌కి హామీ ఇచ్చిన చైనా.. చివరకు అండర్‌వేర్లతో తయారుచేసిన మాస్క్‌లను పంపించింది. నాణ్యమైన మాస్క్‌లు పంపిస్తామని చెప్పిన చైనా.. మాట తప్పి అండర్‌వేర్ క్లాత్‌తో తయారుచేసిన మాస్క్‌లను పంపి మోసం చేసిందని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సింధ్‌ రాష్ట్ర అధికారులు వాటిని తనిఖీ చేయకుండానే కరాచీలోని హాస్పటల్‌కు తరలించినట్లు పాక్ మీడియా తెలిపింది. మొత్తంగా చైనా 2 లక్షల సాధారణ మాస్క్‌లు, 2 వేల ఎన్‌-95 మాస్క్‌లు, 5 వేలవెంటిలేటర్లు, 2 వేలు టెస్టింగ్‌ కిట్‌లు, 2 వేలు ప్రొటెకివ్‌ దుస్తులను పాక్‌కు పంపింది. ఇక పాక్‌లో ఇప్పటి వరకు 2,708 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 40 మంది మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story