క‌రోనాతో ప్రముఖ నటి మృతి

క‌రోనాతో ప్రముఖ నటి మృతి

కరోనా మహమ్మారి బారినపడి చాలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే లక్షల మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ప్రాణాంతకర వైరస్ సెలబ్రిటీలను కూడా బలితీసుకుంటుంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా మ‌రో నటిని ఈ మహమ్మారి బ‌లితీసుకుంది. 91 ఏళ్ల నటి లీ ఫీరో కరోనా బారిన పడి మృతి చెందారు.

1975లో స్టీఫెన్ స్పిల్‌బ‌ర్గ్ రూపొందించిన జాస్ మూవీలో ప్ర‌ముఖ పాత్ర పోషించారు లీ ఫీరో. జాస్ మూవీలో ఆమె కిట్న‌ర్ కు తల్లిగా న‌టించారు. అమెరికాలోని ఓహియోలో నివాస‌ముంటున్న ఆమె మృతి చెందినట్లు ఐలాండ్ థియేట‌ర్ వ‌ర్క్‌షాప్ ప్రెసిడెంట్ కెవిన్ ర్యాన్ సోమ‌వారం ప్ర‌క‌టించారు. మార్తాస్ వైన్‌యార్డ్‌లో ఉన్న ఈ సంస్థ‌కు ఫీరో గ‌త 25 ఏళ్లుగా మెంటార్‌గా కూడా ప‌నిచేస్తున్నారు. ఇక్క‌డే ఆమె 40 ఏళ్లుగా ఉంటున్నారు. లీ మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ర్యాన్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story