మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా

మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా
X

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గజగజ వణికిస్తుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి దేశాలన్నీ పోరాడుతున్నాయి. ఈ క్రమంలో మోదీ సర్కార్ లాక్‌డౌన్‌ విధించి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలను బయటకు రాకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అయితే ఎన్ని రకాలుగా ప్రజలకు అవగాహన కల్పించినా ఉపయోగంలేకపోవడంతో.. ఒడిశా లోని గంజాం జిల్లా కలెక్టర్ జరిమానా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. నగరాల్లో మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయలు, గ్రామీణ ప్రాంతాలవారికి ఐదు వందల రూపాయలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు.

Tags

Next Story