కరోనాపై వాట్సాప్‌ 'చాట్‌ బోట్‌'

కరోనాపై వాట్సాప్‌ చాట్‌ బోట్‌

కరోనాపై పోరుకు వాట్సాప్‌ కూడా సిద్ధమైంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ అన్ని ప్రయత్నాలను చేస్తోంది. అందులో భాగంగా సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుంటోంది. కరోనాపై ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించేందుకు వాట్సాప్‌ తన వినియోగదారులకు ప్రత్యేకంగా ‘చాట్‌ బోట్‌’ను తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

కరోనాపై సమాచారాన్ని అందించేందుకు రాష్ట్ర సర్కార్ రూపొందించిన వాట్సాప్‌ ‘చాట్‌ బోట్‌’ను సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లాక్‌డౌన్‌ను గౌరవిస్తూ ప్రజలంతా ఇంటి వద్దనే ఉండాలని, అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపైనే ఆధారపడాలని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.

9000658658 నంబరుపై ‘‘TS Gov Covid Info’’ పేరిట రూపొందించిన ఈ వాట్సాప్‌ చాట్‌ బోట్‌ ద్వారా కరోనా గురించిన సమాచారంతో పాటు కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియచేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌.బి.టెక్నాలజీస్, మెసెంజర్‌ పీపుల్‌ సంస్థతో కలిసి రాష్ట్ర ఐటీ, వైద్య ఆరోగ్య శాఖలు ఈ చాట్‌ బాట్‌ను రూపొందించాయి. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.

చాట్‌బోట్‌ యాక్టివేట్‌ అవ్వడానికి 9000658658 నంబరుకు ‘HI’లేదా ‘Hello’లేదా ‘Covid’అని వాట్సాప్‌లో సందేశం పంపించాలి. లేదా https://wa.me/919000658658?text=Hi లింకును మొబైల్‌ నుండి క్లిక్‌ చేయాలి. సూచనలు ఉంటే covid19info-itc@telangana.gov.inకి ఈ మెయిల్‌ చేయవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story