కరోనాపై కేంద్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్

కరోనాపై కేంద్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్
X

భారత్ లో కరోనా గురించి వివరిస్తూ.. కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 354 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీంతో.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4421కి చేరుకున్నాయి.

అటు.. కరోనా బారిన పడి గత 24 గంటల్లో 8 మంది మరణించినట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. 326 మంది కరోనా నుంచి కోలుకున్నారని.. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు 3 రకాల సదుపాయాలను కేంద్రం సిద్ధం చేసిందని ఆయన తెలిపారు.

Tags

Next Story