ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

టీడీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
X

లాక్ డౌన్ ప్రభావంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో నిత్యవసరాల కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరాలూ, పట్టణాల్లో రోజువారీ కూలీలా పరిస్థితి దినదిన గండంగా మారింది. ఈ సమయంలో టీడీపీ నాయకులు ఏపీ ప్రజలకు అండగా ఉంటున్నారు.

విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎనికేపాడులో అక్కడ ప్రజలకు కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఎలాంటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ముందుంటారని పేర్కోన్నారు.

Next Story

RELATED STORIES