8 April 2020 12:36 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / భారీ విరాళం...

భారీ విరాళం ప్ర‌క‌టించిన ట్విట్ట‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు

భారీ విరాళం ప్ర‌క‌టించిన ట్విట్ట‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు
X

ప్రపంచంలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమకు చేతనైన సహాయాన్ని అందిస్తున్నారు. తాజాగా సోష‌ల్ నెట్‌వ‌ర్క్ ట్విట్ట‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు జాక్ డార్సే భారీ విరాళాన్ని ప్ర‌క‌టించారు. కోవిడ్‌19పై పోరాటానికి బిలియ‌న్ డాల‌ర్ల స‌హాయం చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. త‌న సంప‌ద‌లోని 28 శాతాన్ని విరాళంగా ఇవ్వ‌నున్న‌ట్లు డార్సే పేర్కొన్నారు.

Next Story