గుజరాత్‌లో కొత్తగా 55 కరోనా పాజిటివ్ కేసులు

గుజరాత్‌లో కొత్తగా 55 కరోనా పాజిటివ్ కేసులు
X

గుజరాత్‌లో కూడా కరోనా వైరస్ విజృంభిస్తుంది. కొత్తగా మరో 55 మంది కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 241కి చేరాయి. అయితే.. కొత్తగా నమోదైన 55 కేసుల్లో ఒక్క అహ్మదాబాద్‌లోనే 50 మందికి సోకినట్టు గుర్తించారు. అటు సూరత్ లో 2, దహోడ్, ఆనంద్, చోటా ఉదేపూర్ లలో ఒక్కొకటి చొప్పున నమోదైంది. ఒక్క అహ్మదాబాద్‌లోనే భారీ స్థాయిలో కేసులు నమోదవ్వటంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.

Tags

Next Story