తెలంగాణ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూత

X
సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమనాయకుడైన కావేటి సమ్మయ్య 2009, 2010లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సమ్మయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
