స్టోర్‌లో మహిళ వింత ప్రవర్తన.. కస్టమర్లు షాక్!

అమెరికాలోని కాలిఫోర్నియాలో సూపర్‌మార్కెట్ కు వెళ్లిన ఓ మహిళ సరదాకి పిచ్చి పని చేసింది. ఆమె చేసిన పనికి పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఆమె ఏం చేసిదంటే.. సూపర్‌మార్కెట్‌లోని సరుకులను కార్టులో వేసుకుని ఎంగిలి చేయడం.
53 ఏళ్ల జెన్నిఫర్ వాకర్ అనే ఓ మహిళ 1,800 డాలర్ల (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.లక్షా 30 వేలు) విలువ చేసే సరుకులను కార్టులో వేసుకుని ఒకదాని తర్వాత మరొకటి ఎంగిలి చేస్తూ కూర్చున్నది. అందులో మాంసం, మద్యంతో సహా రకరకాల నిత్యావసర సరుకులున్నాయి. అసలే కరోనా వైరస్ కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ సమయంలో ఆ మహిళ చేసిన వింత ప్రవర్తనతో స్టోర్ సిబ్బందితో పాటు అక్కడున్న కస్టమర్లు షాక్ అయ్యారు. వెంటనే వారు సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దేశంలో కోవిడ్ 19 విజృంభిస్తున్న కారణంగా ముందు జాగ్రత్తతో ఆమె ఎంగిలి చేసిన సరుకులను ధ్వంసం చేసినట్లు స్టోర్ అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com