11 April 2020 5:10 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / క‌రోనాతో మరో ప్రముఖ...

క‌రోనాతో మరో ప్రముఖ న‌టి మృతి

క‌రోనాతో మరో ప్రముఖ న‌టి మృతి
X

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని అతలకుతలం చేస్తోంది . ఈ వైరస్ నియంత్రించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ రోజు రోజుకు ఈ మహమ్మారి ఎంతో మందిని బలితీసుకుంటుంది. కోరలు చాస్తున్న కరోనా ను కంట్రోల్ చేయడం ఎవరితరం కావడం లేదు. కరోనా మహమ్మారి సామాన్యుడు నుంచి సెలబ్రిటీ వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే కరోనా కాటుకు పలువురు ప్రముఖులు బలయ్యారు.

తాజాగా కరోనా బారిన‌ప‌డి మ‌రో సెలెబ్రిటీ మృతిచెందారు. బ్రిట‌న్‌కు చెందిన సైకాల‌జిస్టు, హాలీవుడ్ న‌టి హిల్లీరీ హీత్ క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయారు. ఈ విష‌యాన్ని ఆమె మ‌నుమ‌డు అలెక్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 74 ఏళ్ల హిల్ల‌రీ ముఖేల్ రీవ్స్ హార్ర‌ర్ చిత్రం విచ్ ఫైండ‌ర్‌తో సినీరంగ ప్ర‌వేశం చేశారు. హిల్లరీ 1960, 1970 ద‌శ‌కాల్లో ప‌లు సినిమాల్లో న‌టించారు. ఆ త‌ర్వాత 1990ల్లో ఆమె సినిమా నిర్మాణ‌రంగంలో అడుగుపెట్టారు. నిల్ బై మౌత్‌, యాన్ ఆవ్‌ఫుల్లీ అడ్వెంచ‌ర్ వంటి మూవీలకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

Next Story