కరోనాతో గాంధీ ఆస్పత్రి దగ్గర మహిళ కన్నుమూత

కరోనాతో గాంధీ ఆస్పత్రి దగ్గర మహిళ కన్నుమూత

తెలంగాణలో కరోనా వైరస్ వల్ల ఓ మహిళ మృతి చెందింది. మూడు రోజుల నుంచి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో బాధితురాలిని ప్రైవేట్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే సుమారు రెండు గంటల పాటు గాంధీ ఆస్పత్రి బయటే ఆమెను ఆంబులెన్స్‌లో ఉంచినట్లు సమాచారం. దీంతో ఆ బాధితురాలు మృతి చెందినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరింది. కరోనా కారణంగా 12 మంది మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story