బ్లాక్‌ మార్కెట్‌ చేయకుండా నియంత్రించాలి.. కేంద్రానికి తెలంగాణ మంత్రి సూచన

బ్లాక్‌ మార్కెట్‌ చేయకుండా నియంత్రించాలి.. కేంద్రానికి తెలంగాణ మంత్రి సూచన
X

కరోనా నియంత్రణ కోసం వినియోగిస్తున్న వైద్యపరికరాలు బ్లాక్‌ మార్కెట్‌ చేయకుండా నియంత్రించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రాన్ని కోరారు. వాటిని కేంద్ర ప్రభుత్వమే సేకరించి రాష్ర్టాలకు అందించాలని సూచించారు. రాష్ర్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ మాట్లాడిన ఈటల రాజేందర్‌ రాష్ట్రంలో, దేశంలో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలపై పన్నులు ఎత్తివేయాలని కోరారు. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు ఈసీఐఎల్‌, డీఆర్‌డివో లాంటి సంస్థల్లో తయారుచేసి రాష్ర్టాలకు అందజేయాలన్నారు.

అటు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని గురించి వివరిస్తూ.. ఇప్పటి వరకూ తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరగలేదని, రాష్ట్రంలో 8500 మందికి కరోనా పరీక్షలు చేస్తే 471 మందికి పాజిటివ్‌ అతి తేలిందన్నారు. 45 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా.. 12 మంది కరోనా చనిపోయినట్టు తెలిపారు.

Tags

Next Story