ఆ నిర్ణయం పూర్తిగా కేంద్రమే తీసుకోవాలి: కేజ్రీవాల్

ఆ నిర్ణయం పూర్తిగా కేంద్రమే తీసుకోవాలి: కేజ్రీవాల్
X

లాక్‌డౌన్‌ పొడిగింపుపై పూర్తి నిర్ణయం కేంద్రమే తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. లాక్‌డౌన్‌పై తదుపరి నిర్ణయం తీసుకునేందుకు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్‌ మరో రెండు వారాలు పొడిగించాలని కోరిన సంగతి తెలిసిందే.

అయితే ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కేజ్రీవాల్.. లాక్‌డౌన్‌‌ను ఏప్రిల్ 30 వరకూ పొడిగించాలని కోరారు. అయితే పొడిగింపుపై నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటే.. పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అన్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ను సడలించినా.. రైలు లేదా రోడ్డు మార్గాల్లో ఎటువంటి రవాణాను అనుమతించకూడదని కేజ్రీవాల్ ప్రధానికి సూచించినట్లు తెలుస్తోంది.

కాగా.. లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags

Next Story