గుంటూరు జిల్లాలో రెండో క‌రోనా మ‌ర‌ణం

గుంటూరు జిల్లాలో రెండో క‌రోనా మ‌ర‌ణం

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి బారినపడి మరో వ్యక్తి మృతి చెందాడు. కరోనా కారణంగా జిల్లాలో ఇప్పటికే ఓ వ్యక్తి మరణించగా.. శనివారం దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో గుంటూరు జిల్లాలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య రెండుకు చేరుకుంది. ఇక శనివారం ఒక్కరోజే కొత్త‌గా 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో జిల్లాలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 71కి చేరుకుంది. ఈ 71 మందిలో గుంటూరు నగరంలోనే 53 మంది క‌రోనా బాధితులు ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

Tags

Next Story