11 April 2020 9:42 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / స్పెయిన్‌లో ఒకే రోజు...

స్పెయిన్‌లో ఒకే రోజు 510 మంది మృతి

స్పెయిన్‌లో ఒకే రోజు 510 మంది మృతి
X

కరోనా పంజా దెబ్బకు స్పెయిన్‌ విలవిల్లాడిపోతోంది. ఓ వైపు అంతకంతకూ కేసులు నమోదు అవుతుండగా.. మరోవైపు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 510 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 16,353కు చేరింది. దేశంలో వరుసగా మూడు రోజుల నుంచి రోజూ కరోనా వైరస్‌ మరణ మృదంగం కొనసాగిస్తోంది. ఈ మహమ్మారి వల్ల శుక్రవారం 605 మంది, గురువారం 683 మంది మరణించారు. అదేవిధంగా దేశంలో కొత్తగా 4,830 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story