ఆంధ్రప్రదేశ్

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళి అర్పించిన చంద్రబాబు

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళి అర్పించిన చంద్రబాబు
X

అంబేద్కర్ జయంతి సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళి అర్పించారు. అంబేద్కర్ మహాశయుడు కృషి వలన సామాజిక ఐక్యతకు అడ్డుగా నిలుస్తున్న కులాల భావన నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి ప్రజాస్వామ్య సిద్ధాంతాలను పాటించగలుగ్గుతున్నామని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా టీడీపీ చేసిన కృషిని ఆయన ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గుర్తు చేశారు. 1990లో అంబేద్కర్ మహాశయునికి భారతరత్న ప్రకటించడంలో నాడు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్న ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని చంద్రబాబు తెలిపారు. అటు పార్లమెంటులో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పటులో కూడా తెలుగుదేశం పట్టుదల ఉందన్నారు. తాను ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం 2003లో జస్టిస్ పున్నయ్య కమిషన్‌ను నియమించిన పార్టీ తెలుగుదేశమే అని గుర్తు చేశారు. గత టీడీపీ హయాంలో రూ.40,253కోట్లను ఎస్సీల సంక్షేమానికి కేటాయించామని చంద్రబాబు వెల్లడించారు.

అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు స్మృతి వనం నిర్మాణం ప్రారంభించామన్నారు. ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ ఆ పథకానికి అంబేద్కర్ విదేశీ విద్యానిధి అని పేరుపెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES