ఏపీలో మరో ఏడు క‌రోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మరో ఏడు క‌రోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో మరో ఏడు క‌రోనా కేసుల న‌మోద‌యినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ క‌రోనా హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. సోమవారం ఉద‌యం 9గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో ఏడుగురికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు. కొత్త‌గా న‌మోద‌యిన కేసుల్లో గుంటూరు 3, నెల్లూరులో 4 కేసులు పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదయిన క‌రోనా కేసుల సంఖ్య 439కి చేరింది.

Tags

Next Story