ఒక్క రోజులో 11 కేసులు.. ఒక వీధిలోనే 8 మందికి..

ఒక్క రోజులో 11 కేసులు.. ఒక వీధిలోనే 8 మందికి..
X

ఢిల్లీ మర్కజ్ భవన్‌కు వెళ్లి వచ్చిన వారిని నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గుర్తించిన పోలీసులు వారిని కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించారు. వారందరినీ ఐసోలేషన్ కేంద్రాలకు పంపించి వారు నివసించిన ఏరియాను రెడ్‌జోన్‌గా ప్రకటించారు అధికారులు. ఆ ఏరియాలో నివసించే వారికి కావలసిన సరుకులను, నిత్యావసర వస్తువులను వారి వద్దకే పంపించే ఏర్పాట్లు చేశారు. ఇలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన తరువాత వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది.

కానీ 11వ తేదీన సూర్యాపేట జిల్లాలో ఒకేసారి 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఈసారి మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలను కట్టుదిట్టం చేశారు. ఇక జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బజార్‌కు చెందిన ఓ కూరగాయల వ్యాపారికి రావడం, అతడితో సన్నిహితంగా ఉన్న మరో 8 మందికి కూడా పాజిటివ్ అని తేలడం.. వైరస్ వ్యాప్తి ఎంత ఉధృతమవుతోందో అర్థమవుతోంది. పాజిటివ్‌ అని నిర్ధారణ అయిన కేసులన్నింటిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత మంది వైరస్ బారిన పడకుండా అధికారులు అప్రమత్తమవుతున్నారు.

Tags

Next Story