యూఎన్ సిబ్బందిలో 189 మందికి కరోనా పాజిటివ్

X
కరోనా మహమ్మారి ఇప్పటి వరకూ 145 దేశాలకు పాకి.. వందల కోట్ల మంది ప్రజలను వణికించేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 19 లక్షల 29 వేల మందికి వైరస్ సోకగా.. లక్షా 20 వేల మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా అమెరికాలో 5,82,607మందికి ఈ వ్యాధి సోకగా.. 23000 మంది మృతి చెందారు. ఇక ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐక్యరాజ్యసమితి సిబ్బందిలో ఇప్పటివరకు 189 మందికి సోకింది. యూఎన్ సిబ్బందిలో 189 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి ఫర్హాన్ హక్ ప్రకటించారు. వ్యాధి సోకినవారిలో ముగ్గురు మృతి చెందినట్లు వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
