స్వస్థలాలకు వెళ్లినా.. ఇంట్లోనే కదా ఉంటారు: సీపీ సజ్జనార్

స్వస్థలాలకు వెళ్లినా.. ఇంట్లోనే కదా ఉంటారు: సీపీ సజ్జనార్

వలసకూలీలకు, ప్రజలకు పోలీసులు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. లాక్‌డౌన్‌పై ఫేక్ న్యూస్ ప్రచారం అవుతుందని.. అలాంటి వార్తలను నమ్మవద్దని సూచించారు. ఎలాంటి అపోహలు లేకుండా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని.. వలస కూలీలకు, ప్రజలకు పోలీసులు అందుబాటులోనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఆశ్రయం కోల్పోయిన వారికి ప్రత్యేక షెల్టర్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. స్వస్థలాలకు వెళ్లినా ఇంట్లోనే ఉండాల్సి ఉంటుందని.. ఇబ్బంది పది అక్కడని వెళ్లే కంటే ఇక్కడ ఉండటం ఉత్తమమని సజ్జనార్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story