కరోనా కాటుకు మాజీ క్రికెటర్ బలి..

కరోనా కాటుకు మాజీ క్రికెటర్ బలి..

కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న వేళ ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కరోనా కాటుకు బలయ్యారు. శ్వాస కోశ ఇబ్బందులతో గత వారం ఆసుపత్రిలో జాయినయిన సర్ఫరాజ్‌కు కరోనా టెస్ట్‌లు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే వ్యాధి తీవ్రత ఎక్కువ అవడంతో సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మూడు రోజులు వెంటిలేటర్ మీద ఉంచామని వైద్యులు తెలిపారు. లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అయిన సర్ఫరాజ్ తన కెరీర్‌లో 6 వన్డేలు ఆడి 96 పరుగులు చేశారు. రిటైర్మెంట్ అనంతరం సీనియర్ జట్టుతో పాటు అండర్-19 జట్టుకు కోచ్‌గా పని చేశారు. కాగా, గత నెలలో కరోనా కారణంగా పాకిస్తానీ స్వ్వాష్ ప్లేయర్ ఆజమ్ ఖాన్ మృతి చెందారు. ఇప్పటి వరకు పాకిస్తాన్‌లో కరోనా పాజిటివ్ కేసులు 5 వేలు నమోదు కాగా, అందులో 96 మంది మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story