డబ్ల్యూహెచ్‌ఓతో కలసి కరోనాపై అవగాహన కల్పించనున్న ఫేస్‌బుక్ మెసెంజర్

డబ్ల్యూహెచ్‌ఓతో కలసి కరోనాపై అవగాహన కల్పించనున్న ఫేస్‌బుక్ మెసెంజర్

కరోనాపై అవగాహన కల్పించేందుకు ఫేస్‌బుక్ మెసెంజర్ ముందుకొచ్చింది. డబ్ల్యూహెచ్‌ఓతో కలసి చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ఈ ఫేస్‌బుక్ మెసెంజర్ చాట్‌బాట్ లో కరోనా వైరస్ కు సంబంధించిన సమగ్ర వివరాలు అందిస్తారు. ఇప్పటికే వాట్సాప్ డబ్ల్యూహెచ్‌ఓతో కలసి చాట్‌బాట్‌ను ప్రారంభించింది. తాజాగా పేస్ బుక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంతో కోవిడ్ -19 అవగాహనకు చాట్ బాట్ ను ఆవిష్కరించింది. పేస్ బుక్ మెసెంజర్ కు నెలవారీ 1.3 బిలియన్లకు పైగా యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు. కనుక దీని ద్వారా కరోనాపై సమాచారాన్ని సులభంగా అందజేయవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ ఈ మేరకు చాట్‌బాట్‌ను ప్రారంభించింది. డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన హెల్త్ అలర్ట్ ఇంటరాక్టివ్ సర్వీస్ ను పేస్ బుక్ లోని డబ్ల్యూహెచ్‌ఓ అధికారిక పేజీ నుండి యాక్సెస్ చేయవచ్చు. ఆ పేజీలో ఉన్న మెసెంజర్ చిహ్నాన్ని టచ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story