మౌలానా సాద్‌పై హత్యకేసు.. కరోనా వ్యాప్తికి కారణమంటూ నోటీసులు

X
By - TV5 Telugu |15 April 2020 10:10 PM IST
తబ్లీగీ చీఫ్ మౌలానా సాద్‌పై హత్యకేసు నమోదైంది. గత నెల 13,14,15 తేదీలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాతే మర్కజ్ సదస్సు జరిగింది. దేశ విదేశాల నుంచి వేలాది మంది హాజరయ్యారు. దీని వలన ఎక్కువగా వ్యాప్తి చెందిందని అధికారులు తేల్చారు. అనేక రాష్ట్రాల నుంచి ఈ సభకు జమాతే హాజరయ్యారని.. వారి ద్వారా కరోనా వ్యాపించినట్లు గుర్తించారు. దీంతో కరోనా మహమ్మారి వ్యాప్తికి కారకులయ్యారంటూ.. తబ్లీగీ జమాతే చీఫ్ మౌలానా సాద్‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. ఇప్పటికే మౌలానా సాద్ సెల్ఫ్ క్వారంటైన్ సమయం పూర్తైంది. దీంతో ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ సాద్‌కు పోలీసులు రెండు నోటీసులు పంపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com