మహారాష్ట్రలో పంజా విసురుతున్న కరోనా.. 3089కి చేరిన కేసులు

మహారాష్ట్రలో పంజా విసురుతున్న కరోనా.. 3089కి చేరిన కేసులు
X

కరోనా మహమ్మారి మహారాష్ట్రలో రోజురోజుకు విజృంభిస్తుంది. గత 24 గంటల్లో 165 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసులు సంఖ్య 3089కి చేరింది. ఒక్క ముంబై మహా నగరంలోనే గత 24 గంటల్లో 107 కేసులు నమోదయ్యాయి. అటు.. మురికివాడైన ధారావిలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. గత 24 గంటల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. అటు బాంద్రా రైల్వే స్టేషన్ బయట 2 వేల మంది గుమిగూడిన ఘటనలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags

Next Story