కరోనాపై పోరాటం చేస్తున్న వారి కోసం ప్రత్యేక రైలు

కరోనాపై పోరాటం చేస్తున్న వారి కోసం ప్రత్యేక రైలు
X

కరోనాపై పోరాటం చేస్తున్న పలువురు సిబ్బందికి రైల్వే శాఖ ప్రత్యేకంగా ఒక రైలును నడిపిస్తున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా వైద్యులు, నర్సులు, పోలీసులు, రైల్వే భద్రతా పోలీసులు సహా మొత్తం 16 శాఖల సిబ్బంది కోసం ఏర్పాటు చేశారు. అరక్కోణం నుంచి జోలార్‌పేట వరకు బుధవారం నుంచి 3 బోగీలతో ప్రత్యేక రైలును నడిపిస్తున్నారు. అరక్కోణం నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరే రైలు 9 గంటకు జోలార్‌పేట చేరుకుంటుంది. తీగ ప్రయాణంలో సాయంత్రం 6 గంటలకు జోలార్‌పేట నుంచి బయల్దేరి రాత్రి 9 గంటలకు అరక్కోణం చేరుకుంటుంది. రైల్వేశాఖ అందించిన ఉచిత పాసులు పొందినవారు ప్రయాణించవచ్చని దక్షిణ రైల్వే తెలియజేసింది.

Tags

Next Story