దక్షిణకొరియా పార్లమెంట్‌ ఎన్నికల్లో అధికార పార్టీ ఘ‌న విజ‌యం

దక్షిణకొరియా పార్లమెంట్‌ ఎన్నికల్లో అధికార పార్టీ ఘ‌న విజ‌యం
X

దక్షిణకొరియా పార్లమెంట్‌ ఎన్నికల్లో అధికార పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. దేశంలోని మొత్తం 300 పార్ల‌మెంట్ స్థానాల‌కుగాను 21 పార్టీలకు చెందిన 1,400 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే అధికార డెమోక్రటిక్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి 180 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష యునైటెడ్ ఫ్యూచర్ పార్టీ కేవలం 103 సీట్లకు ప‌రిమితం అయ్యింది.

కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ విజయవంతంగా పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహించి దక్షిణ కొరియా చరిత్ర సృష్టించింది. పోలింగ్‌ సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. చైనా తర్వాత దక్షిణకొరియాలోనే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందింది. అయితే, దక్షిణకొరియా సర్కార్ వేగంగా స్పందించి వైరస్‌ని క‌ట్ట‌డి చేయ‌డంలో విజ‌యం సాధించింది. ఆ దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 10,613 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా కారణంగా 229 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story