తెలంగాణలో 700 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో 700 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు గురువారం అనూహ్యంగా పెరిగాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో.. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 700కి చేరింది. రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గురువారం కరోనా బారిన పడి కోలుకున్న 68 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 186 మందిని డిశ్చార్జ్‌ చేశారు.

Tags

Next Story