సీసీసీకి కాజల్ విరాళం

సీసీసీకి కాజల్ విరాళం

కరోనా మహమ్మారి దేశంలో స్వైర విహారం చేస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. దీంతో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్‌ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్‌ చారిటీ(సీసీసీ) మనకోసంను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ఛారిటీకి పలువురు సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు.

తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. రూ.2 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. ఆర్టీజీఎస్ ద్వారా సీసీసీకి డబ్బు అందించినట్టు కాజల్ మేనేజర్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story