కరోనా వైరస్‌పై యుద్ధం.. జర్మనీ సాధించిన విజయం

కరోనా వైరస్‌పై యుద్ధం.. జర్మనీ సాధించిన విజయం

జర్మనీలో జనవరి 27నే మొదటి కరోనా వైరస్ కేసును గుర్తించారు. వూహాన్‌కి చెందిన ఒక చైనా సహోద్యోగి ద్వారా జర్మనీ వ్యక్తికి కరోనా వ్యాపించింది. అలా ఒక వ్యక్తి నుంచి అయిదు గురికి సోకింది. ఏప్రిల్ 14 నాటికి 1.3 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే అందులో సగం మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,495 కరోనా మరణాలు సంభవించాయి. పాజిటివ్ కేసులను గుర్తించడం, పరిస్థితి క్షీణించక ముందే చికిత్స వేగవంతం చేయడం జర్మనీ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి రేటు గణనీయంగా తగ్గడం అక్కడి అధికారులను ఊపిరి పీల్చుకునేలా చేసింది.

పాజిటివ్ కేసుల్లో 2294 మంది ఐసీయూలో ఉండగా 73 మంది వెంటిలేటర్ల మీద ఉన్నారు. కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైరస్‌ను ఎలా కట్టడి చేయగలిగారని ఆరా తీస్తే.. ప్రభుత్వం రూపొందిచిన కరోనా నివారణ ప్రణాళిక ద్వారా వ్యాధి నియంత్రణ సమూహాలను ఏర్పరచి ప్రత్యేక చర్యలు తీసుకుంది. మార్చి 22న భారత్‌కు మాదిరిగానే జర్మనీ కూడా జాతీయ కర్ఫ్యూ విధించింది. సరిహద్దులు మూసి వేసి ఇతర దేశాలతో ఉన్న రాకపోకలను కట్టడి చేసింది. అత్యవసరమైతే ప్రజలు బయటకు అడుటు పెట్టకూడదని ఆంక్షలు విధించింది.

పాజిటివ్ కేసులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా 132 కేంద్రాలు ఏర్పాటు చేసి వారానికి 3 లక్షల నుంచి 5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించే సామర్ధ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ విధంగా ఇప్పటి వరకు 13.5 లక్షల మంది కరోనా పరీక్షలు నిర్వహించారు. వ్యాధి లక్షణాలు గుర్తించన వెంటనే చికిత్స ప్రారంభించడం. టెలీ మెడిసన్ వంటి సదుపాయాల ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంది. జర్మనీ దేశ జనాభా తక్కువగా ఉండడం కలిసి వచ్చిన అదృష్టం. మొత్తం జనాభా 8 కోట్లు ఉంటే రాష్ట్రాలు 16 ఉన్నాయి.

ప్రతి పౌరుడికి విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. ఇక ఏటా ప్రతి వ్యక్తి ఆరోగ్యం కోసం రూ.4.5 లక్షలను ఖర్చు పెడుతుంది. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇది చాలా పెద్ద మొత్తం. జర్మన్ ప్రజలందరూ తప్పని సరిగా ఆరోగ్య భీమా చేయించుకోవాల్సి ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయగలుగుతున్నారంటే జర్మనీ అనుసరిస్తున్న వ్యూహాత్మక ప్రణాళిక.. పగడ్భందీ చర్యలే కారణమని పలువురు విశ్లేషకులు కొనియాడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story