కర్నూల్లో కరోనా.. డాక్టర్ ఫ్యామిలీలో ఆరుగురికి..

కర్నూల్లో కరోనా.. డాక్టర్ ఫ్యామిలీలో ఆరుగురికి..

తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే దక్షిణ కొరియా నుంచి లక్ష కోవిడ్ కిట్లను తెప్పించింది. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సిబ్బందిని పెంచే నిమిత్తం డాక్టర్ రిక్రూట్మెంట్ కూడా చేపడుతోంది. రాష్ట్రంలో ఎక్కువ కేసులు కర్నూలు జిల్లాలో వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 13 కేసులు నమోదు కాగా.. వీటిలో ఆరు కేసులు ఇటీవల మృతి చెందిన డాక్టర్ కుటుంబ సభ్యులవి కావడం గమనార్హం.

ఇక మరో ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యురాలికి కూడా పాజిటివ్ అని తేలింది. తాజా సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 5, చిత్తూరు జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 4, కడప జిల్లాలో 1.. కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ఎక్కువ కేసులు గుంటూరు, కర్నూలు జిల్లాలలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు గుర్తించిన వెంటనే వైద్యం అందించడంతో 35 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story