ఇంటి అద్దెలు వసూలు చేయొద్దన్న మహారాష్ట్ర ప్రభుత్వం.. మరి వారి సంగతేంటి?

ఇంటి అద్దెలు వసూలు చేయొద్దన్న మహారాష్ట్ర ప్రభుత్వం.. మరి వారి సంగతేంటి?
X

మహారాష్ట్ర ప్రభుత్వం కరోనాపై చేస్తున్న పోరాటంలో భాగంగా లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేస్తోంది. దీంతో దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారికి ఉపాధి లేకుండాపోయింది. దీంతో వారు ఇంటి అద్దెలు కూడా కట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముంబై, పుణె నగరాల్లో రోజువారీ కూలీల పరిస్థితి అత్యంత దయానీయంగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హౌసింగ్ శాఖ ఇళ్ల యజమానులకు కీలక సూచనలు చేసింది.

ఈ కష్టకాలంలో కనీసం మూడు నెలల పాటు ఇంటి యజమానులు అద్దెలు వసూలు చేయవద్దని ఆదేశించింది. ఈ సమయంలో.. అద్దె కట్టలేదన్న కారణంగా ఏ ఒక్క కుటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయించవద్దని యజమానులకు సూచించింది. ఇంటి అద్దెపైనే ఆధారపడే వారి సంగతేంటనే వాదన కూడా తెరపైకి వచ్చింది.

Tags

Next Story