కరోనా ఒక మంచి అవకాశం: రాహుల్ గాంధీ

కరోనా ఒక మంచి అవకాశం: రాహుల్ గాంధీ
X

కరోనా ఒక మంచి అవకాశం లాంటిది అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన కరోనా మహమ్మారి దేశానికి కచ్చితంగా ఓ ఛాలెంజ్ లాంటిదే.. కానీ, ఇది ఓ అవకాశం కూడా మనం చెప్పుకోవాలని అన్నారు. ఈ ఆపత్కార సమయంలో దేశంలో ఉన్న నిపుణుల టాలెంట్ బయటపడుతోంది అన్నారు. దేశంలో అతి పెద్ద సంఖ్యలో ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డేటా నిపుణులు కొత్త కొత్త, వినూత్న పరిష్కార మార్గాలను చూపే మంచి అవకాశం అని రాహుల్ ట్వీట్ చేశారు.

Tags

Next Story