ఆక్వా ఎగుమతులపై అసోం సీఎంతో మాట్లాడిన ఏపీ సీఎం జగన్

ఆక్వా ఎగుమతులపై అసోం సీఎంతో మాట్లాడిన ఏపీ సీఎం జగన్
X

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపల ఎగుమతికి ఉన్న అడ్డంకులు తొలగించాలని అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌‌కు విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఆక్వా ఉత్పత్తులు అసోంకు ఎగుమతి అవుతాయన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని.. అలాగే చేపల మార్కెట్లను మూతపడకుండా తెరవాలంటూ జగన్ కోరారు. దీనిపై స్పందించిన అసోం సీఎం అలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అటు.. లాక్‌డౌన్‌ కారణంగా ఏపీలో చిక్కుకున్న అసోం వాసులకు తగిన సహాయాన్ని అందించాలని జగన్ ను కోరారు. అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నామని వైఎస్‌ జగన్‌ కూడా మాటిచ్చారు.

Tags

Next Story