ఆ వార్తల్లో నిజం లేదు.. పెన్షనర్లకు ఆందోళన అవసరం లేదు: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆ వార్తల్లో నిజం లేదు.. పెన్షనర్లకు ఆందోళన అవసరం లేదు: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
X

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లలో కోత విధిస్తారని వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వార్తల్లో నిజంలేదని.. ప్రభుత్వం అలాంటి ఆలోచనల్లో లేదని తెలిపింది. ఉద్యోగుల పెన్షన్లలో ఎలాంటి కోత ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు స్పష్టం చేసింది.

ఈమేరకు ఓ ట్వీట్ చేసింది. 'కేంద్ర ప్రభుత్వ పెన్షన్లలో 20 శాతం కోత వేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. పెన్షన్ల చెల్లింపుల్లో ఎలాంటి కోత ఉండదు' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో కోత విధిస్తామనే ఆందోళన ఎవరికీ అవసరం లేదని.. పైగా ఈ సమయంలో పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని తెలిపింది.

Tags

Next Story