ఈసీ వివాదంపై హై కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

ఈసీ వివాదంపై హై కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
X

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పదవీ కాలాన్ని కుదించడంపై దాఖలైన ఏడు కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కామన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. సీఎస్ తరఫున పంచాయితీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది కామన్ కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. పంచాయతీ రాజ్ చట్టం లో మార్పులు చేస్తూ.. ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న రమేష్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఏడు కేసులు దాఖలయ్యాయి. దీనిపై స్పందించిన హై కోర్ట్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. దీంతో ప్రభుత్వం అన్ని కేసులకు కలిపి కామన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

Tags

Next Story