పర్యావరణానికి మేలు చేసే గబ్బిలాలు.. కరోనా కారకాలు కాదు..

పర్యావరణానికి మేలు చేసే గబ్బిలాలు.. కరోనా కారకాలు కాదు..

చైనీయులు తినే చెత్త తిండి వల్లే కరోనా వచ్చిందని కొందరంటే, గబ్బిలాలే కరోనా వాహకాలు అని వాదించే వారూ లేకపోలేదు. కరోనాకి కారణాలేమైనా.. ఆ పాపం గబ్బిలాలది మాత్రం కాదంటోంది కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్సీసీస్ (సీఎంఎస్) సంస్థ. నిజానికి గబ్బిలాలు మానవ జాతికి ఏ మాత్రం హాని చేయకపోగా, వాటివల్ల అనేక లాభాలున్నాయని చెబుతోంది.

కోవిడ్ అనేది మనిషి నుంచి మనిషికి సంక్రమించే వైరస్. గబ్బిలాల నుంచి నేరుగా మనిషికి ఈ వైరస్ సంక్రమించిన దాఖలాలు లేవు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1400 గబ్బిలాల జాతులు చాలా వరకు అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిమీదా ఉంది. అడవుల్లో తిరుగాడే గబ్బిలాలు పట్టణ జీవితానికి అలవాటు పడి గార్డెన్లు, పార్కులు, బ్రిడ్జ్‌ల క్రింద స్థావరాలను ఏర్పరచుకుంటున్నాయి.

గబ్బిలాల వలనే వృక్షాల్లో పరాగసంపర్కం జరుగుతుంది. విత్తన వ్యాప్తి జరుగుతుంది. కీటకాలను తింటాయి. వీటి వలన జరిగేది మేలే కాని కీడు కాదు అని పరిశోధకులు అంటున్నారు. కోవిడ్‌కి కారణం గబ్బిలాలు అని వాటిని చంపేస్తున్నారు. ఇది సరికాదు. వాటిని చంపడం వలన కోవిడ్ వ్యాప్తి నిర్మూలనను ఆపలేం. ఇలా చేయడం వలన వాటి జాతి అంతరించి పోతుంది. పర్యావరణాన్ని సంరక్షించే గబ్బిలాలను నిర్మూలించడం సహేతుకం కాదని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story