ఒకే ఇంట్లో 31 మందికి క‌రోనా పాజిటివ్

ఒకే ఇంట్లో 31 మందికి క‌రోనా పాజిటివ్
X

దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఒకే కుటుంబంలో 31 మందికి క‌రోనా సోకటం కలకలం సృష్టిస్తోంది. జ‌హంగీర్ ప్రాంతానికి చెందిన ఓ మ‌హిళ ఏప్రిల్ 8న మృతి చెందింది. దీంతో అనుమానం వ‌చ్చిన డాక్ట‌ర్లు ఆమెకు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ పరీక్ష‌ల్లో ఆమెకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ నేఫథ్యంలో అధికారులు ఆమె కుటుంబ స‌భ్యుల‌కు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారి కుటుంబీకులైన 26 మందికి క‌రోనా పాజిటివ్ గా తేలింది. అంతేకాదు తాజాగా మ‌రో ఐదుగురు కుటుంబీకుల‌కు ల‌క్ష‌ణాలు క‌నిపిండంతో మ‌ళ్లీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారికీ కూడా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఒకే కుటుంబంలోని 31 మందికి క‌రోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు.

Tags

Next Story