తెలుగువారిని ఆదుకోండి.. గుజరాత్ సీఎంకు జగన్ ఫోన్

X
ఏపీ సీఎం జగన్ పలు రాష్టాల సీఎంలతో మాట్లాడి.. లాక్ డౌన్ సమయంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. 3 రోజుల క్రితం అసోం ముఖ్యమంత్రితో మాట్లాడి.. చేపల ఎగుమతులకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసిన జగన్.. తాజాగా.. గుజరాత్ సీఎం విజయ్రూపానీతో మాట్లాడారు. గుజరాత్ లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. లాక్ డౌన్ కారణంగా గుజరాత్ లో తెలుగు మత్స్యకారులు చిక్కుకున్నారని.. వారికి నిత్యావసర సరుకులు పాపిని చేసి ఆడుకోవాలని కోరారు. ఈ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. వైద్య సౌకర్యాలు కల్పించాలని అన్నారు. దీనిపై గుజరాత్ సీఎం సానుకూలంగా స్పందించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
