లాక్‌డౌన్‌ అమలుపై కేంద్ర మంత్రిమండలి సమావేశం

లాక్‌డౌన్‌ అమలుపై కేంద్ర మంత్రిమండలి సమావేశం
X

ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరుగుతుంది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ అమలు పై సమీక్ష జరుపుతున్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడులో ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలపై, భవిష్యత్ లో తీసుకోబోయే చర్యలపై కీలకంగా చర్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని.. అయితే.. కొత్తగా కొన్ని జిల్లాలో నమోదవుతున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు ప్రధాని మోడీకి సూచించారు. ఇటీవల ప్రకటించిన రెండో ఉద్దీపన ప్యాకేజీ ఎంత వరకు పేదల వరకు చేరిందని దానిపై చర్చిస్తున్నారు.

Tags

Next Story