కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఉద్యోగికి కరోనా పాజిటివ్

కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఉద్యోగికి కరోనా పాజిటివ్
X

కరోనా మహమ్మారి ఇండియాలో స్వైర విహారం చేస్తోంది. దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా 20వేలకు పైగా ఈ మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్నారు. తాజాగా భారత పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉద్యోగిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు చేశారు. ఈ పరీక్షలో సదరు ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలింది. కాగా ఆ వ్యక్తి ఈ నెల 15వ తేదీని మంత్రిత్వ శాఖ కార్యాలయానికి విధుల‌కు హాజ‌ర‌య్యారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాధితుడితో కాంటాక్ట్ అయిన ఇతర ఉద్యోగులందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

Tags

Next Story