అంతర్జాతీయం

డబ్ల్యూహెచ్‌ఓకు భారీగా నిధులు కేటాయించిన చైనా

డబ్ల్యూహెచ్‌ఓకు భారీగా నిధులు కేటాయించిన చైనా
X

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధులను నిలిపివేయటంతో.. తాజాగా చైనా భారీగా నిధులను కేటాయించింది. కరోనా వ్యాప్తికి కారణమైన చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెనకేసుకొని వస్తుందని.. దీని వలన కరోనా వ్యాప్తి మరింత తీవ్రమవుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ సంస్థకు నిధులను నిలిపివేశారు. పరిస్థితులు మెరుగుపడితేగాని.. తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల కొరత లేకుండా చైనా చర్యలు తీసుకుంటుంది. దీనికి అనుగుణంగా 30 మిలియన్ డాలర్ల నిధులను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.

అయితే.. మార్చి 11న 20 మిలియన్ల డాలర్ల సహాయం చేసిన చైనా తాజాగా మరో మరో 30 మిలియన్ డాలర్లను విడుదల చేస్తామని ప్రకటించింది. కరోనా కల్లోల పరిస్థితుల్లో ఆదుకోవడం మంటే ఐక్యతను చాటడమే అని చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Next Story

RELATED STORIES