కరోనా కంటే అది పెద్ద సమస్య: మమతా బెనర్జీ

కరోనా కంటే అది పెద్ద సమస్య: మమతా బెనర్జీ
X

కరోనా కంటే అతి పెద్ద సంక్షోభాన్ని ముందు ముందు ఎదుర్కోబోతున్నామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘ధరిత్రి దినోత్సవం’ పురస్కరించుకొని ఆమె ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘వాతావరణ మార్పులు’ కూడా రానూ రానూ అతిపెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని.. వాటికి వ్యతిరేకంగా అందరూ ఐకమత్యంతో పోరాడి, భూమిని రక్షించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ రోజు ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కరోనా అని.. అయితే.. భవిష్యత్ లో వాతావరణ మార్పులతో మరింత పెద్ద సమస్యను ఎదుర్కోబోతున్నామని అన్నారు.

Tags

Next Story