ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండాలి: మన్మోహన్ సింగ్

ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండాలి: మన్మోహన్ సింగ్
X

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తే కరోనాపై విజయం సాధించవచ్చని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. అయితే కరోనాని అంతం చేసాయడానికి మనం ఏ పద్దతి అనుసరిస్తున్నామనేది కూడా చాలా ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మన్మోహన్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

కరోనా పై చేస్తున్న ఈ పోరాటంలో మనం అనేక సమస్యలపై దృష్టి పెట్టాలని.. అలాగే కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ఎన్ని వనరులు లభిస్తున్నాయన్న దానిపై కూడా ఆధారపడి ఉంటుందని అన్నారు. చివరకు విజయం అనేది మన సామర్థ్యం పైనే ఆధారపడి ఉంటుందని మన్మోహన్ సింగ్ తెలిపారు.

Tags

Next Story