కరోనాతో సౌదీ అరేబియాలో 11 మంది భారతీయులు మృతి

X
సౌదీ అరేబియాలో 11 మంది భారతీయులు కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారిన పడి 11 మంది భారతీయులు మృతి చెందారని సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 22 వరకు ఈ మరణాలు నమోదయ్యాయి.
మదీనాలో నలుగురు, జెడ్డాలో ఇద్దరు, మక్కాలో ముగ్గురు, రియాద్, దమ్మమ్ లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని ప్రకటించారు. సౌదీలో ఉన్న ప్రవాస భారతీయులంతా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. సౌదీలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,930కి చేరింది.
మరో వైపు లాక్ డౌన్ కారణంగా భారత్ కు విమానాల సర్వీసుల రాకపై నిషేధం ఎత్తివేయలేమని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులను తరలించే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
