జూలో నాలుగు పులులకు, మూడు సింహాలకు కరోనా

జూలో నాలుగు పులులకు, మూడు సింహాలకు కరోనా
X

న్యూయార్క్ లోని ఓ జూలో నాలుగు పులులు, 3 సింహాలకు వైరస్ సోకింది. గత నెలలో ఇదే జూలోని నదియా అనే నాలుగు సంవత్సరాల ఆడ పులి కరోనా వైరస్‌ బారిన పడింది. ఆడ మలయన్ పులికి వైరస్ సోకినప్పుడు ఎలా ప్రవర్తించిందో వీటికి అవే లక్షణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. వాటి ముక్కు, గొంతు, శ్వాస నాళం నుంచి శాంపుల్స్ తీసి వైద్య పరీక్షలకు పంపించామని తెలిపారు.

జూలో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది జంతువులు కరోనా బారినపడ్డాయని పేర్కొన్నారు. వైరస్‌ సోకినప్పటికి ఆ జంతువులు మామూలుగానే ఉంటున్నాయని, తింటున్నాయని, దగ్గు కూడా తగ్గిందని తెలిపారు.

Tags

Next Story